నేను నిన్ను ప్రేమిస్తున్నానంటూ
ఉద్వేగంగా ప్రకటించినప్పుడు
పెద్ద తప్పు చేస్తున్నానని తోచలేదు.
ఏం తెలిసిందని ప్రేమంటే?-
లలితంగా అవయవాల
సున్నితమైన కదలికలు,
కనుచూపులు, పెదవి విరుపులు,
హావభావాల అసందర్భ ఆరాటాలు,
తారుణ్యం తొణికే లావణ్యాలమబ్బులు,
నీల నిర్వేద సముద్రపుటలల
అవ్యక్త పరిమళాలు...
అల్లాఉద్దీన్ అద్భుతదీపంలో నుంచి
ఊడిపడ్డ గందరగోళపు
ఇంద్రజాల స్వప్నాన్ని అనుభవించి,
'గాబరా'ని ఆబగా వరించి,
ప్రేమ అని పొరపడ్డానా?-,
తల్చుకుంటే చిత్రంగా ఉంటుంది.
ప్రేమ ఘట్టాల్లో అవిరామంగా ప్రయాణిస్తూ
అద్భుతద్రుశ్యాలు చూసే అనిభవంలో,
తెలియకుండా కాలం గడుస్తుండగా....
.............
ఏదో ఒక నిర్లిప్త సందర్భం
హేమంత ఉషోదయ కాంతిలో
పొగమంచు మబ్బును చెదరగొట్టి,
ఇవతలివైపు వాస్తవంలోకి తోసేసి-
నన్ను ఏకంతంగా నిలబెట్టినప్పుడు...
వయస్సు టక్కరి తనంలో
నిరంతరం కూడికలు, తీసివేతలు,
బతుకును పట్టుకు వేలడుతున్నప్పుడు,
సుదూరాలకు ఎగిరిపోయే
ప్రేమ రెక్కల చప్పుడు...విన్నాను.
తెలిసిపోయే నిజం
ఎప్పుడూ బాధగానే ఉంటుంది.
నువ్వొక నిత్యావసరానివి- అంతే.
నేనొక దేశవాళీ మగమనిషిని.
ఇద్దరిలో
నిజం ఎవరికి ముందు తెలుస్తుందో
ఉత్కంఠ- అదే!!
స్వప్నం, ఒక అసంబద్ధ వ్యాపకంగా
పరిణమించడమే దాని తత్వరహస్యం.
ఒకానొక సుఖస్వప్న హేమంతంలోంచి
బయటకు వచ్చి నిలబడ్డాను.
తీర్మాన వాక్యంలాగ!
- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ
ఉద్వేగంగా ప్రకటించినప్పుడు
పెద్ద తప్పు చేస్తున్నానని తోచలేదు.
ఏం తెలిసిందని ప్రేమంటే?-
లలితంగా అవయవాల
సున్నితమైన కదలికలు,
కనుచూపులు, పెదవి విరుపులు,
హావభావాల అసందర్భ ఆరాటాలు,
తారుణ్యం తొణికే లావణ్యాలమబ్బులు,
నీల నిర్వేద సముద్రపుటలల
అవ్యక్త పరిమళాలు...
అల్లాఉద్దీన్ అద్భుతదీపంలో నుంచి
ఊడిపడ్డ గందరగోళపు
ఇంద్రజాల స్వప్నాన్ని అనుభవించి,
'గాబరా'ని ఆబగా వరించి,
ప్రేమ అని పొరపడ్డానా?-,
తల్చుకుంటే చిత్రంగా ఉంటుంది.
ప్రేమ ఘట్టాల్లో అవిరామంగా ప్రయాణిస్తూ
అద్భుతద్రుశ్యాలు చూసే అనిభవంలో,
తెలియకుండా కాలం గడుస్తుండగా....
.............
ఏదో ఒక నిర్లిప్త సందర్భం
హేమంత ఉషోదయ కాంతిలో
పొగమంచు మబ్బును చెదరగొట్టి,
ఇవతలివైపు వాస్తవంలోకి తోసేసి-
నన్ను ఏకంతంగా నిలబెట్టినప్పుడు...
వయస్సు టక్కరి తనంలో
నిరంతరం కూడికలు, తీసివేతలు,
బతుకును పట్టుకు వేలడుతున్నప్పుడు,
సుదూరాలకు ఎగిరిపోయే
ప్రేమ రెక్కల చప్పుడు...విన్నాను.
తెలిసిపోయే నిజం
ఎప్పుడూ బాధగానే ఉంటుంది.
నువ్వొక నిత్యావసరానివి- అంతే.
నేనొక దేశవాళీ మగమనిషిని.
ఇద్దరిలో
నిజం ఎవరికి ముందు తెలుస్తుందో
ఉత్కంఠ- అదే!!
స్వప్నం, ఒక అసంబద్ధ వ్యాపకంగా
పరిణమించడమే దాని తత్వరహస్యం.
ఒకానొక సుఖస్వప్న హేమంతంలోంచి
బయటకు వచ్చి నిలబడ్డాను.
తీర్మాన వాక్యంలాగ!
- ఇంద్రగంటి శ్రీకాంత శర్మ